అంకితభావంతో విధులు నిర్వర్తించాలి
ములుగు: ఐసీడీఎస్ సిబ్బంది క్షేత్రస్థాయిలో అంకితభావంతో విధులు నిర్వర్తించి జిల్లాకు మంచిపేరును తీసుకురావాలని జిల్లా సంక్షేమ అధికారిణి కూచన శిరీష అన్నారు. జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, కార్యాలయ సిబ్బంది, ఐటీ వింగ్ కో ఆర్డినేటర్, పోషణ్ అభియాన్ సిబ్బందితో శనివారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా లబ్ధిదారులకు సమగ్రమైన సేవలను అందించాలన్నారు. గర్భిణులు, బాలింతలు మూడు నుంచి ఆరు సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారులు ప్రతిరోజూ అంగన్‌వాడీ కేంద్రాలకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. వారికి పౌష్టికాహారం అందించడానికి అమ్మమాట–అంగన్‌వాడీ బాట కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. చిన్నారులకు ఆటపాటలతో పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు కృషి చేయాలన్నారు. వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదుచేయాలని సూచించారు. ఎన్‌హెచ్‌టీఎస్, పోషణ్ ట్రాకర్ యాప్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురైనా పోషణ్ అభియాన్ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని తెలిపారు.
జిల్లా సంక్షేమ అధికారి శిరీష
Comments
Please login to add a commentAdd a comment