మేడారంలో భక్తుల సందడి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగు స్నానఘట్టాల వద్ద బ్యాటరీ ఆఫ్ ట్యాప్ వద్ద స్నానాలు చేశారు. అనంతరం అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీర, సారె, ఒడిబియ్యం, ఎత్తు బంగారం, కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజులకు పూజలు నిర్వహించారు. గద్దెల ప్రాంగణంలో దొంగలు చేతివాటం ప్రదర్శించకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అనుమానితులను పోలీసులు విచారించారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం పరిసరాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకున్నారు. దేవాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్లు మధు, బాలకృష్ణలు అందుబాటులో ఉండి వీఐపీ దర్శనాలు చేయించారు. సుమారుగా 10వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
హేమాచలక్షేత్రంలో..
మంగపేట: రెండో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామి నిజరూప దర్శనం చేసుకుని భక్తులు పులకించారు. ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ఆదివారం తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. వివిధ వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి హేమాచల కొండపై ఉన్న ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక అర్చనలు జరిపించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. ఆలయ పూజారులు భక్తుల గోత్ర నామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించి వేద ఆశీర్వచనం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment