‘భరోసా’తో బయటికొస్తారా?
మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ శబరీశ్ పిలుపు
ఏటూరునాగారం: నమ్మిన సిద్ధాంతాల కోసం అడవిబాట పట్టిన మావోయిస్టుల కుటుంబాలకు పోలీసులు భరోసా ఇస్తున్నారు. అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని ప్రత్యేక డ్రైవ్‌ను జిల్లాలో ఎస్పీ శబరీశ్ ఆధ్వర్యంలో చేపట్టారు. అజ్జాతంలో ఉన్న మావోయిస్టుల సొంత గ్రామాలకు వెళ్లి వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు దీనగాథను వింటూ ప్రభుత్వం నుంచి సాయం అందిస్తూ అక్కున చేర్చుకుంటున్నారు. కన్నకొడుకులు, కూ తుళ్లు దగ్గరలో లేకున్నా మేము ఉన్నామని పోలీసులు మావోయిస్టుల కుటుంబాలకు సాయం చేస్తున్నారు. వారి కష్టాల్లో పాలు పంచుకుంటున్నారు.
మన ఊరుకు తిరిగిరండి..
పోరు కన్నా.. ఊరు మిన్న.. మన ఊరుకు తిరిగిరండి అనే నినాదంతో జిల్లాలో పోలీసులు స్పెషల్ డ్రైవ్‌ను మొదలు పెట్టారు. సీపీఐ మావోయిస్టు పార్టీలో గత కొన్ని దశాబ్దాలుగా అజ్ఞాతంలో రాష్ట్ర కమిటీ హోదాలో వెంకటాపురం(ఎం) మండలం లక్ష్మీదేవిపేటకు చెందిన తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్, గోవిందరావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ పనిచేస్తున్నారు. జిల్లా కమిటీ హోదాలో కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామానికి చెందిన పులసం పద్మ అలియాస్ గంగక్క, ఏటూరునాగారం మండలం గోగుపల్లికి చెందిన ఈసం అర్జున్ అలియాస్ రఘుపతి, ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన సాధనపల్లి చందు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారు. వీరి ఇళ్ల వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులను కలుస్తూ వారం రోజులుగా ఎస్పీ శబరీశ్ పరామర్శిస్తున్నారు. బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు.
ఇటీవల కాలంలో లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు..
గతేడాది ఏప్రిల్ నెలలో వాజేడు మండలం ప్రగళ్లపల్లికి చెందిన పుల్లురు నాగరాజు లొంగిపోయాడు. అలాగే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మావోయిస్టు పార్టీ సెకండ్ కమాండర్ సీఆఆర్సీకి చెందిన నుపు భీమా అలియాస్ సంజు, మంచుకి దుడ్డ అలియాస్ సోని, ఏసీఎం 2వ సీఆర్సీ మావోయిస్టు సభ్యుడు లొంగిపోయాడు. గతేడాది ఆగస్టు 12న మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య వద్ద ఏరియా కమిటీ సభ్యులుగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయిబాబా జిల్లాకు చెందిన గాలి నారాయణరెడ్డి అలియాస్ చందర్‌రావు, బాపట్లకు చెందిన దుడ్ల తేజ అలియాస్ అమర్నాథరెడ్డి, అర్జున్ లొంగిపోయారు. అక్టోబర్ 21న జనతన సర్కారు జారుపల్లి ఆర్పీసీ అధ్యక్షుడు మావోయిస్టు సభ్యుడు తాటి భామన్ పారేడు ఏసీలో సభ్యుడిగా పనిచేస్తూ లొంగిపోయాడు. అక్టోబర్ 31న సీపీఐ మావోయిస్టు జిల్లా కమిటీ సభ్యురాలు కడతి కమల అలియాస్ లక్ష్మి, కొరియర్ మంగ్లు లొంగిపోగా డిసెంబర్ 10న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం పెద్ద గెలూరుకు చెందిన లేఖం లచ్చు అలియాస్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తూ లొంగిపోయాడు. డిసెంబర్ 25న మావోయిస్టు పార్టీ నేషనల్ పార్క్ ఏరియా కమిటీకి చెందిన సభ్యురాలు అలువ స్వర్ణ అలియాస్ స్వర్ణక్క లొంగిపోయారు.
వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని హామీ
పోలీసుల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్
Comments
Please login to add a commentAdd a comment