ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికై న జెడ్పీ ఉన్నత పాఠశాల
వెంకటాపురం(ఎం): ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు–2024లో భాగంగా మల్టీజోన్–2లో 19 జిల్లాల నుంచి జిల్లాలో ఒక ఉత్తమ పాఠశాలను ఎంపిక చేశారు. ఈ మేరకు జిల్లా నుంచి వెంకటాపురం(ఎం) జెడ్పీ ఉన్నత పాఠశాల ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం రాధిక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో శాంతా బయోటెక్ అధినేత వరప్రసాద్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్య, విద్యాపీఠ వైస్ చైర్‌పర్సన్ ప్రీతిరెడ్డిల నుంచి అవార్డును అందుకున్నట్లు వెల్లడించారు. అవార్డు రావడానికి కృషి చేసిన డీఈఓ పాణిని, సెక్టోరియల్ అధికారులకు ఉపాధ్యాయ బృందం జనగాం బాబురావు, అంబేడ్కర్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment