‘పది’లో ఉత్తమ ఫలితాలు సాధించాలి
ములుగు రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి పాణిని తెలిపారు. మండల పరిధిలోని కోయగూడెం జిల్లా పరిషత్ పాఠశాలను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈఓ మాట్లాడారు. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. ప్రత్యేక తరగతుల నిర్వహణ, రిజిస్టర్లు, స్లిప్ టెస్టులు, బేస్‌లైన్ టెస్టులు, టెస్టుల ఫలితాలను పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. ఉపాధ్యాయులు సబ్జెక్ట్‌ల వారీగా ప్రశ్న పత్రాలను తయారు చేసి టెస్టులు నిర్వహించి వారాంతంలో మూల్యాంకనం చేయాలని సూచించారు. ప్రత్యేక తరగతుల విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించారు. అనంతరం రాంచంద్రాపూర్ మండల పరిషత్ పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల పఠన సామర్థ్యాన్ని డీఈఓ పరిశీలించారు.
డీఈఓ పాణిని
Comments
Please login to add a commentAdd a comment