హమాలీల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి
ములుగు రూరల్: సివిల్ సప్లయీస్ హమాలీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హమాలీలు చేపట్టిన సమ్మె మంగళవారానికి 7వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడారు. హమాలీలకు గతంలో పెంచిన ధరల జీఓను విడుదల చేయకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. ప్రతీ రెండేళ్లకోసారి పెంచాల్సిన ఎగుమతి, దిగుమతి ధరలను కార్మికులు సమ్మెలు చేస్తే తప్పా పెంచడం లేదని ఆరోపించారు. పెంచిన ధరలకు జీఓ విడుదల చేయడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యహరిస్తుందని ఆరోపించారు. హమాలీలు సమ్మె విరమించకుంటే వేరే కార్మికులతో పనులు చేయిస్తామని సివిల్ సప్లయీస్ డీఎం రాంపతి హెచ్చరించగా జీఓ విడుదల అయ్యేంత వరకు సమ్మె విరమించేది లేదని కొనసాగించారు. కార్యక్రమంలో కార్మికులు సుమన్, రాంబాబు, రమేష్, పైడి, భిక్షపతి, రఘుపతి, రాజు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్
Comments
Please login to add a commentAdd a comment