టీకాల ప్రాముఖ్యతను వివరించాలి
ములుగు/వెంకటాపురం(ఎం): గర్భిణులు, చిన్నారులకు క్రమం తప్పకుండా ఇచ్చే వ్యాధి నిరోధక టీకాల ప్రాముఖ్యతను వివరించాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలకు ఆదేశించారు. ములుగు మండల పరిధిలోని రాయినిగూడెం పీహెచ్‌సీ సిబ్బందితో జిల్లా కేంద్రంలోని వైద్యారోగ్యశాఖ సమావేశ మందిరంలో మంగళవారం ఆశ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి ఆరోగ్యం, చిన్నారులకు పోహకాహారం, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, శిశు ఆరోగ్యం, టీబీ నియంత్రణ వంటి జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను వందశాతం సాధించాలన్నారు. మాతాశిశు సంరక్షణ, పోహకాహారంలో భాగంగా గర్భిణుల నమోదు సంఖ్యను పెంచాలన్నారు. ప్రతీ ఆశకార్యకర్త 10మంది నుంచి తెమడను సేకరించి ల్యాబ్‌కు పంపించాలన్నారు. పాజిటివ్‌గా తేలిన వారికి సకాలంలో మందులు అందించి తగ్గుముఖం పట్టేలా చూడాలని వివరించారు. అనంతరం వెంకటాపురం (కె)మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో నిర్వహించిన ఆశ కార్యకర్తల సమావేశానికి డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు హాజరై మాట్లాడారు. ఆరోగ్య కార్యక్రమాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అసంక్రమిక వ్యాధులైన హైపర్ టెన్షన్, షుగర్ స్క్రీనింగ్ టెస్టులను ఈ మాసంలో పూర్తి చేయాలన్నారు. అనంతరం వ్యాధి నిరోధక టీకాల ఫ్రోగ్రాం ఆఫీసర్ రణధీర్ వ్యాధి నిరోధక టీకాల ప్రాముఖ్యతను వివరించారు. పీహెచ్‌సీలో ప్రతీ మంగళవారం నిర్వహిస్తున్న మహిళా క్లినిక్‌ను డీఎంహెచ్‌ఓ తనిఖీ చేసి వివరాలను డాక్టర్ రిషితను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విపిన్‌కుమార్, పీహెచ్‌సీ వైద్యులు ప్రసాద్ పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
Comments
Please login to add a commentAdd a comment