రైతు ‘భరోసా’ ఎందరికి!?
సాక్షిప్రతినిధి, వరంగల్ : రైతు భరోసాపై సాగుతున్న చర్చకు ప్రభుత్వం ఫుల్‌స్టాప్ పెట్టింది. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరిట ఈ పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. కొత్త రేషన్‌కార్డులతో పాటు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకాన్ని ఈనెల 26 నుంచే అమలు చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ప్రకటించారు. సాగుకు యోగ్యమైన భూములు కలిగిన, అర్హులైన రైతులకు ‘భరోసా’ఇవ్వనున్నట్లు చెప్పారు. తండాలు, గూడేలు, మారుమూల గ్రామాలు, పల్లెల్లో భూమిలేని వ్యవసాయ రైతు కుటుంబాలకు కూడా ఈ పథకం వర్తింపజేయనుండగా, పెట్టుబడి సాయం అందని అర్హులైన రైతులు మంగళవారం వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ నేపథ్యంలో కొద్ది నెలలుగా రైతు భరోసా అమలుపై వ్యక్తమవుతున్న అనుమానాలు, సందేహాలకు తెరపడినట్లయ్యింది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 8,77,173 మంది..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత యాసంగి వరకు 8,77,173 మంది రైతులు రైతుబంధుకు అర్హులుగా ఉన్నారు. హనుమకొండ జిల్లాలో 1,50,982, వరంగల్ 1,54,405, జేఎస్ భూపాలపల్లి 1,16,574, ములుగు 76,692, జనగామ 1,85,937, మహబూబాబాద్‌లో 1,92,583 మంది రైతులకు గత యాసంగిలో రూ.880 కోట్ల మేర పంట పెట్టుబడి అందింది. ఆ తర్వాత వానాకాలంలో భరోసా కల్పించకపోవడంతో రైతులు పెట్టుబడి సాయం కోసం మళ్లీ ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో ఎంత భూమి ఉన్నా ఎకరానికి ఏడాదికి రూ.10 వేల చొప్పున రైతుబంధు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎకరానికి రూ.7,500 చొప్పున ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ లెక్కన ప్రతీ సీజన్‌లో రూ.880 కోట్ల వరకు వచ్చే రైతుబంధు సాయం మరో రూ.440 కోట్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు నివేదికలు పంపారు.
‘ఉపసంఘం’ పర్యటన తర్వాత నిర్ణయం..
రైతుభరోసా అమలుపై ప్రభుత్వం ఆరు నెలల కాలంలో వివిధ కోణాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించింది. ఇదే క్రమంలో గతేడాది జూలై 11 నుంచి 23 వరకు మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరుల బృందం జిల్లాల్లో పర్యటించింది. విభిన్నవర్గాలు, నిపుణులు, అధికారులు, రైతు సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించి.. పలు కోణాల్లో పరిశీలన, కసరత్తు అనంతరం శనివారం నిర్వహించిన కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 26 నుంచి రైతు భ రోసా పేరిట ఎకరానికి ఏడాదికి రూ.12 వేల చొ ప్పున రైతులకు పెట్టుబడి సాయం అందించనున్న ట్లు ప్రకటించారు. కాగా, రైతులతో పాటు రైతుకూలీలకు భరోసా కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. తండాలు, గూడేలు, మారుమూల గ్రామాలు, పల్లెలోని భూమిలేని రైతు కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఏడాదికి రూ.12 వేలు చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాల్లో భూమిలేని నిరుపేద కుటుంబాలకు, వ్యవసాయంపై ఆధారపడిన రైతుకూలీలకు భరో సా కలుగనుంది.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అమలు..
ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు అర్హులైన రైతులకు ‘భరోసా’ లభిస్తుంది. ఇప్పటికే రైతు భరోసా పథకంపై రైతులు, రైతు సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించిన ప్రభుత్వం వీటిన్నంటినీ పరిగణనలోకి తీసుకొని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరిట అమలు చేయనుంది. సర్కారు నుంచి అందే కొత్త మార్గదర్శకాల వచ్చాకే సాయం అందుతుంది.
– కె.దామోదర్‌రెడ్డి, ఏడీఏ నర్సంపేట
గత యాసంగిలో రైతుబంధు లబ్ధిదారులు, అందిన సాయం వివరాలు..
జిల్లా రైతులు నిధులు (రూ.లలో)
హనుమకొండ 1,50,982 136,08,18,594
వరంగల్ 1,54,405 136,47,64,319
మహబూబాబాద్ 1,92,583 203,80,86,807
ములుగు 76,692 79,18,74,092
జయశంకర్‌భూపాలపల్లి 1,16,574 117,47,18,093
జనగామ 1,85,937 206,70,50,167
ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు
ఈనెల 26వ తేదీ నుంచి అమలు
కొత్త మార్గదర్శకాలు, దరఖాస్తులపై చర్చ
2024 యాసంగిలో
8.77 లక్షల మంది రైతులు
ఈసారి సంఖ్య పెరుగుతుందా?
తగ్గుతుందా?
భూమిలేని రైతు కుటుంబాలకు
ప్రయోజనం
కసరత్తు ప్రారంభించిన అధికారులు
Comments
Please login to add a commentAdd a comment