ములుగు మున్సిపాలిటీపై హర్షం
ములుగు: ములుగు మున్సిపాలిటీకి కేబినెట్ శనివారం ఆమోదం తెలుపడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఆదివారం సంబురాలు జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్ ముఖ్యఅతిథిగా హాజరై సీఎం, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం రవిచందర్ మాట్లాడుతూ ములుగు మున్సిపాలిటీ కోసం ఈ ప్రాంత ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా వేచిచూస్తున్నారని తెలిపారు. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతోనే మున్సిపాలిటీ ఏర్పాటు అయ్యిందని వివరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్‌గౌడ్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు వంగ రవియాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు ఎండీ.చాంద్‌పాషా, పట్టణ అధ్యక్షుడు చింతనిప్పుల భిక్షపతి, నియోజకవర్గ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు మారం సుమన్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు జక్కుల రేవంత్‌యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ చిక్కుల రాములు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల భరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా గ్రామ పంచాయతీ ఈఓ పెంట రఘు సమక్షంలో జీపీ సిబ్బంది సీఎం, మంత్రి సీతక్క చిత్ర పటాలకు పాలాభిషేకం చేశా రు. దీంతో పాటు సిబ్బందికి గ్రామ పంచాయతీ తరఫున కాకుండా ప్రతినెలా 5వ తేదీ లోపు కమిషనర్ కార్యాలయం నుంచి గౌరవవేతనం అందించడం చారిత్రాత్మక నిర్ణయంగా పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క
చిత్రపటానికి పాలాభిషేకం
Comments
Please login to add a commentAdd a comment