మెగా జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి
గోవిందరావుపేట: జిల్లా గ్రామీణాభిభివృద్ధి, ఈజీఎంఎం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నేడు నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర సూచించారు. మండల పరిధిలోని చల్వాయి గ్రామ శివారులో ఉన్న పీఎస్‌ఆర్ గార్డెన్‌లో మంగళవారం జాబ్‌మేళాను నిర్వహిస్తున్న సందర్భంగా సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన 50 ప్రత్యేకమైన డైరెక్ట్ ప్లేస్‌మెంట్ ఇచ్చే కంపెనీలకు ప్రత్యేకమైన స్టాల్స్‌తో పాటు మరో 30 కంపెనీలు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించే స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. జాబ్‌మేళాకు వచ్చే యువతకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంతో పాటు సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. నేడు నిర్వహించనున్న మెగా జాబ్‌మేళాకు యువతీ యువకులు తప్పకుండా రావాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపత్ రావు, డీపీఎం సతీష్, ఏపీఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
Comments
Please login to add a commentAdd a comment