ములుగు: సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన సమ్మె సోమవారం 28వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా సకినాలు వేసి నిరసన తెలిపారు. మహిళా ఉద్యోగులు కటుంబాలను వదిలి నెల రోజలుగా రోడ్లపైకి చేరి నానా తంటాలు పడుతున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ముందుకు వచ్చి తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మెను విరమించేదిలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి కరుణాకర్, మహిళా అధ్యక్షురాలు జీవనప్రియ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment