ఉపాధితోనే భరోసా
ఏటూరునాగారం: ఉపాధితోనే భరోసా కలుగుతుందని ఏటూరునాగారం సీఆర్‌పీఎఫ్ 39వ బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్ కుమార్ శ్రీవాస్తవ్ అన్నారు. మండల కేంద్రంలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపులో సోమవారం సీఆర్‌పీఎఫ్ సివిక్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 55 మంది నిరుద్యోగ యువతి, యువతులకు ఉపాధి కోర్సులైన టైలరింగ్, డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్‌లో ఉచితంగా నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తామన్నారు. వారిలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఆర్‌ఐటీఐ, అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌పీఎఫ్ పోలీసులు, యువతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment