రైతుభరోసా రూ.15వేలు ఇచ్చే వరకు పోరాటం
ములుగు: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతుభరోసా రూ.15వేలు ఇచ్చేంత వరకు పోరాడుతామని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ జెడ్పీచైర్‌పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జిల్లాకేంద్రంలో బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి భారీర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుంచి ఏరియా ఆస్పత్రి మీదుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేఖ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాగజ్యోతి మాట్లాడుతూ ఎన్నికల ముందు వరంగల్ రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పిందన్నారు. మాట తప్పిన సీఎం రేవంత్‌రెడ్డి రైతాంగానికి క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు భిక్షపతి, రమేష్‌రెడ్డి, జగదీశ్, సమ్మయ్య, రమణయ్య, సునీల్, మల్లారెడ్డి, విజయ్, ఇరుప విజయ, చంద్రమౌళి, గండి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్
నాగజ్యోతి
Comments
Please login to add a commentAdd a comment