జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి
వెంకటాపురం(ఎం): జిల్లాలోని గోవిందరావుపేట మండలంలోని చల్వాయి పీఎస్‌ఆర్ గార్డెన్‌లో రేపు నిర్వహించనున్న మెగా జాబ్‌మేళా కార్యక్రమాన్ని దివ్యాంగ నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని దివ్యాంగ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుమారు 15వేల ఉద్యోగాలను విద్యార్హతను బట్టి ఎంపిక చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పంచకపు శ్రీనివాస్, పెద్దబోయిన శ్రీనివాస్, మంచోజు చంద్రమౌళి, భద్రయ్య, తీగల రజిత, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
లయన్స్‌క్లబ్ ఉత్తమ
రెండో సెక్రటరీగా రమేశ్
ములుగు: ములుగు లయన్స్‌క్లబ్ రెండో ఉత్తమ సెక్రటరీగా చంచు రమేశ్ అవార్డు గెలుచుకున్నారు. హనుమకొండ జిల్లా చింతగట్టులోని కేఎల్‌ఎం కన్వెషన్‌లో ఆదివారం నిర్వహించిన లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ 320 ఎఫ్ రీజియన్ వన్ మీట్‌లో క్లబ్ వారీగా బ్యానర్లను ప్రదర్శించారు. ఇందులో ములుగు క్లబ్ చేపట్టిన సేవా కార్యక్రమాలకు ఫస్ట్‌బెస్ట్ స్కార్ప్ బుక్, సెకెండ్ బె్‌స్ట్ ఫొటో ఎగ్జిబిషన్, సెకెండ్ బెస్ట్ నీడ్ బేసిక్ యాక్టివిటీస్ వంటి అవార్డులు దక్కాయి. ముఖ్యఅతిఽథిగా హాజరైన డాక్టర్ ఏవీ గురువారెడ్డి ఏజెన్సీలో క్లబ్ సేవా కార్యక్రమాలు చేపడుతుండడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రెసిడెంట్ లయన్ మెరుగు రమేష్, కోశాధికారి రవీందర్‌రెడ్డి, కొండి సాంబశివ, కమలాకర్‌రావు, పూజారి రఘు, శ్రీనివాస్, ఆడెపు రాజు తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న సమగ్రశిక్ష ఉద్యోగుల సమ్మె
ములుగు: సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలో చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 27వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉ ద్యోగ, ఉపాధ్యాయులతో సమానంగా అన్ని రకాల బెనిఫిట్స్ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు చల్లా భాస్కర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి సోమిడి కరుణాకర్, కోశాధికారి కుమార్‌పాడ్య, ఉపాధ్యక్షుడు ఫిరోజ్, భూ రెడ్డి విష్ణు, చిరంజీవి, సుజాత, సమన్వయకర్తలు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
హాసినికి కాంస్య పతకం
టేకుమట్ల: ఎస్‌జీఎఫ్ అండర్–19 సైక్లింగ్ ట్రాక్ రేస్ చాంపియన్ షిప్‌లో టేకుమట్ల ఉన్నత పాఠశాల టెన్త్ విద్యార్థిని వెల్లంపల్లి హాసిని కాంస్య పతకం సాధించినట్లు పీడీ చాగంటి ఆనంద్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సైక్లింగ్ కోచ్‌గా మమత, జ్యోతి వ్యవహరించగా టేకుమట్ల పేరును ఉమ్మడి జిల్లాలో కాంస్య పతకం సొంతం చేసుకున్న హాసిని నిలబెట్టిందని పీడీ చాగంటి ఆనంద్ సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మరిన్ని పథకాలను విద్యార్థులు సాధించడంలో నిరంతరం శ్రమిస్తానని అన్నారు.
డ్రంకెన్ డ్రైవ్ కేసులో జైలు
కాటారం: డ్రంకెన్ డ్రైవ్ కేసులో వాహనదారుడికి జిల్లా కోర్టు రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమాన విధించినట్లు కాటారం ఎస్సై మ్యాక అభినవ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మహదేవపూర్ మండలం బెగుళూరుకు చెందిన వెంకయ్య మద్యం సేవించి వాహనం నడుపుతూ మండల కేంద్రంలో పోలీసులకు చిక్కాడు. దీంతో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేసి శనివారం కోర్టులో హాజరుపరిచారు. వెంకయ్యకు భూపాలపల్లి మేజిస్ట్రేట్ రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. వెంకయ్యను పరకాల సబ్ జైలుకు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని, లైసెన్స్, హెల్మెట్, నంబర్‌ప్లేట్, ఇతరపత్రాలు వెంట ఉంచుకోవాలని ఎస్సై ఈ సందర్భంగా సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment