బాలకార్మిక వ్యవస్థ అనాగరికం
ములుగు రూరల్: బాలకార్మిక వ్యవస్థ అనాగరిక చర్య అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్ అన్నారు. ఈ మేరకు శనివారం జిల్లాకేంద్రంలోని సఖి సమావేశ మందిరంలో ఆపరేషన్ స్మైల్ సమన్వయ సమావేశం జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లలను పనిలో పెట్టుకుంటే ఉపేక్షించేది లేదన్నారు. బాల్యం ఎంతో అమూల్యమైన దశ అని భవిష్యత్‌ని నిర్ణయించేది బాల్యమేనని వివరించారు. 14 సంవత్సరాల పిల్లలు తప్పని సరిగా బడిలో ఉండాలన్నారు. ఇటుకబట్టీలు, భవన నిర్మాణ రంగం, మిర్చి తోటల్లో బాల కార్మికులు ఉంటే వారిని గుర్తించి చదువుకునేలా చూడాలన్నారు. ఆపరేషన్ స్మైల్‌లో భాగస్వాములైన సిబ్బందికి న్యాయ సేవాధికార సంస్థ మద్దతు ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎఫ్‌సీఎం జడ్జి సౌఖ్య, బాలల సంక్షేమ సమితి చైర్‌పర్సన్ వసుధ, ఏఎల్‌ఓ వినోద, జేజేబీ సుబాష్, డీపీఓ రమణమూర్తి, మంగపేట, ములుగు ఎస్సైలు సురేష్, ఇమ్మాన్యూయేల్, మౌనిక, డీసీపీయూ ప్రొటెక్షన్ ఆఫీసర్ కృష్ణవేణి, హరికృష్ణ, సంజీవ, సిబ్బంది జ్యోతి, సుమన్, రాజు, నరేష్, సదయ్య, సీహెచ్‌ఎల్ కోఆర్డినేటర్ నరేష్, సిబ్బంది నాగమణి, చంటి తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్యలాల్
Comments
Please login to add a commentAdd a comment