ఆదివారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2025
– 8లోu
గూడూరు: ఎల్లో–రంప్డ్ ఫ్లైక్యాచర్ అని కూడా పిలిచే అరుదైన కొరియన్ ఫ్లైక్యాచర్‌ను గతేడాది ఏప్రిల్‌లో గూడూరు మండలంలోని భీముని పాదం జలపాతం వద్ద గుర్తించారు. అంతుచిక్కని స్వభావానికి పేరుగాంచిన ఈ పక్షిని ప్రభుత్వ ఉద్యోగి, పక్షుల పరిశీలకుడు హరి గోపాలాచారి శ్రీరంగం తన కెమెరాలో బంధించారు. శీతాకాలంలో ఆగ్నేయాసియాకు వలస వెళ్లే ముందు. అదేవిధంగా సీతానగరం శివారు కొమ్ములవంచ సమీప దట్టమైన అడవిలో ఇటీవల పర్యాటకులకు ఈఅరుదైన పక్షి కనిపించింది. దీని శరీర భాగం పాలపిట్ట మాదిరిగా బ్లూ కలర్‌లో ఉండగా, ముక్కు పొడవుగా ఉందని అటవీశాఖ
అధికారి తెలిపారు.
కొరియన్
ఫ్లైక్యాచర్
పక్షులు.. పర్యావరణానికి నేస్తాలు. మానవాళికి చుట్టాలు. కిచకిచమని రాగం తీసే సహజ సంగీత పుంగవులు. విశ్వాన్ని గాలించి గడ్డో.. పరకో సేకరించి.. చిన్న గూడునల్లుకునే ఇంజనీర్లు. పురుగూపుట్రా దరిచేరకుండా పంటకు కాపలా కాసే సైనికులు. కిలకిలారావాలతో సందడి చేసే.. ప్రకృతి హితులు. తీరాలు దాటి ఉమ్మడి జిల్లాకు ఎగిరొస్తున్న పక్షులెన్నో.. వీటన్నింటికీ ఓరుగల్లు ఆతిథ్యమిస్తోంది. ఇదే సమయంలో తరిగిపోతున్న అడవులు, పెరుగుతున్న కమ్యూనికేషన్ రంగాల నేపథ్యంలో పక్షుల సంఖ్య తగ్గిపోతోంది. నేడు (ఆదివారం) జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. – సాక్షి నెట్‌వర్క్
న్యూశాయంపేట: వరంగల్ కాకతీయ జూపార్కులో వివిధ రకాల పక్షులు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. మన దగ్గర సంచరించేవి కాక వివిధ ప్రాంతాల్లో ఉండే ఆస్ట్రిచ్(3), వైట్ రేహా బర్డ్స్(3), హంసలు వైట్ అండ్ బ్లాక్(3), పీఫౌల్(పీకాక్స్ 15), వైట్ పీకాక్స్(2), పీషాంట్స్(6), జంగిల్ ఫౌల్స్(12), పీజియన్స్(45), ప్యారెట్స్(22), లౌ బర్డ్స్(35) సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
న్యూస్‌రీల్
భీమునిపాదం వద్ద కొరియన్ ఫ్లైక్యాచర్ గుర్తింపు
జూపార్కులో కనువిందు చేస్తున్న పక్షులు
కనుమరుగవుతున్న పిచ్చుకలు
Comments
Please login to add a commentAdd a comment