హుండీ ఆదాయం రూ.7.35లక్షలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలోని హుండీల లెక్కింపు ద్వారా రూ.7.37 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రావణం సత్యనారాయణ తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరకాల డివిజన్ పరిశీలకులు నందనం కవిత పర్యవేక్షణలో ఆలయంలో ఏర్పాటు చేసిన 8 హుండీల లెక్కింపును శనివారం నిర్వహించారు. 2024 ఆగస్టు 30 నుంచి ఈ నెల 3 వరకు ప్రధానాలయంతో పాటు వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన 8 హుండీలలో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ద్వారా రూ.7లక్షల 37వేల 539 ఆదాయం సమకూరినట్లు వెల్లడించారు. అదే విధంగా హుండీలలో 33 అమెరికా డాలర్లు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, కై ంకర్యం రాఘవాచార్యులు, ముక్కామల రాజశేఖర్శర్మ, సీనియర్ అసిస్టెంట్ సీతారామయ్య, శేషు, లక్ష్మినారాయణ, సిబ్బంది, మణుగూరు రామాలయం సేవా భక్తబృదం వారు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment