కాళేశ్వరం రాజగోపురం నుంచి మెట్ల మార్గం
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానం తూర్పు రాజగోపురం నుంచి శ్రీరామాలయం రోడ్డు వరకు మెట్ల మార్గం పనులను పంచాయతీరాజ్ అధికారులు ప్రారంభించారు. మాజీ సీఎం కేసీఆర్ గతంలో ఆలయ అభివృద్ధికి రూ.25కోట్ల నిధులు కేటాయించిన విషయం తెలిసిందే. ఆనిధుల నుంచి రూ.50లక్షల వ్యయంతో 100మీటర్ల పొడవుతో సెంట్రల్ లైటింగ్‌తో అధునాతనంగా నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. పనుల్లో భాగంగా ఇప్పటికే ఉన్న సీసీ రోడ్డు డ్రిల్లింగ్ చేసి తొలగిస్తున్నారు. ఆ మెట్ల మార్గంలో సీసీతోపాటు టైల్స్ వేయనున్నారు. కాగా, తూర్పు రాజగోపురం వద్దకు గోదావరి నుంచి, ఇటు బస్టాండ్ మీదుగా వచ్చే వాహనాలు ఇక మీదట అనుమతి లేదు.
Comments
Please login to add a commentAdd a comment