గుడి అభివృద్ధికి నిధులు కేటాయించాలి
ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని గట్టమ్మతల్లి గుడి అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆదివాసీ నాయకపోడ్ జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ అన్నారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో పీఓ చిత్రామిశ్రాకు గురువారం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆదివాసీ నా యకపోడ్ సంఘం నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెలలో మేడారంలో జరిగే సమ్మక్క–సారలమ్మ మినీ జాతరకు వెళ్లే భక్తులు మొదటగా గట్టమ్మ వద్ద మొక్కులు చెల్లిస్తారని తెలిపారు. ఇందుకోసం భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి తాగునీరు. శానిటేషన్, పందిళ్ల ఏర్పాటు, పూజారులకు క్వార్టర్స్ నిర్మాణం, ఆలయానికి రంగులు వేయించడానికి ఐటీడీఏ నుంచి నిధులు కేటాయించాలని కోరారు. దేవర్ల నృత్యాలతో అంగరంగ వైభవంగా ఎదురు పిల్ల పండుగ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పీఓ స్పందించి నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు, గట్టమ్మ పూజారులు కొత్త సదయ్య, ఆకుల మొగిలి, కొత్త లక్ష్మయ్య, కొత్త రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీ నాయకపోడ్
జిల్లా అధ్యక్షుడు సురేందర్
Comments
Please login to add a commentAdd a comment