నాటుసారా తయారీపై ఉక్కుపాదం
ములుగు: జిల్లాలో నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపేందుకు నెలరోజుల పాటు స్పెషల్ డ్రైవ్ ఎకై ్సజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రొహిబిషన్ డైరెక్టర్ ఆదేశాలతో నిర్వహించనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధికారి వి.శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నాటుసారాయి తయారీ కేంద్రాలను, తయారీదారులను గుర్తిస్తామని తెలిపారు. గుడుంబా తయారీ ముడి సరుకులు అమ్మేవాళ్లను గుర్తించి అరె స్టు చేసి కేసులు నమోదు చేస్తామని వివరించారు. బైండోవర్ చేసి, బైండోవర్ నిబంధనల ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తామని తెలిపారు. లేదా జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఇంకనూ పద్ధతి మార్చుకోని వారిపై పీడీయాక్ట్ నమోదు చేస్తామని వెల్లడించారు. పోలీసు, రెవెన్యూ, అటవీశాఖల భాగస్వామ్యంతో జిల్లాలో నాటు సారాను పూర్తిగా రూపుమాపేందుకు ఎకై ్సజ్ శాఖ కృతనిశ్చయంతో ముందుకెళ్తుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment