టాటాఏస్‌ను ఢీ కొట్టిన కారు
ములుగు రూరల్/వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని లింగాపూర్ పరిధిలో గల జాతీయ రహదారిపై ఓ కారు అతి వేగంగా వెళ్తూ ముందుగా వెళ్తున్న టాటాఏస్ వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయి ఢీ కొట్టింది. దీంతో టాటాఏస్‌లో ప్రయాణిస్తున్న ఐదుగిరికి తీవ్ర గాయాలు కాగా మరో ఆరుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. తొర్రూరుకు చెందిన 15మంది అశోక్ లేలాండ్ (టాటా ఏస్) వాహనంలో మేడారం వెళ్లి అమ్మవార్లను దర్శించుకొని ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ములుగుకు చెందిన కొంతమంది మేడారం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో లింగాపూర్ పరిధిలో ముందు వెళ్తున్న టాటా ఏస్‌ను ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో టాటాఏస్ వాహనాన్ని ఢీకొట్టడంతో అందులో ఉన్న విజయ, వెంకన్న, శ్రీనివాస్, ప్రవీణ్, లక్ష్మికి తీవ్రగాయాలు కాగా మురళి, శేఖర్, సిరి, వినయ్, రజిత, సరస్వతికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని వెంటనే 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని వెంకటాపురం ఎస్సై సతీశ్ సందర్శించారు.
ఐదుగురికి తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment