క్రీడల్లో గెలుపోటములు సహజం
గోవిందరావుపేట: క్రీడల్లో గెలుపోటములు సహజం అని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాబివృద్ధి, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని చల్వాయిలో ‘చల్వాయి వాలీబాల్ యూత్’ ఆధ్వర్యంలో మూడు రోజులుగా జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుండగా.. చివరి రోజు మంగళవారం రాష్ట్ర మంత్రి సీతక్క హాజరయ్యారు. ఫైనల్ మ్యాచ్‌లో మురుమురు గ్రామ జట్టు గెలుపొందగా.. వారికి రూ.15,016 ప్రథమ బహుమతి, కొంగల గ్రామ జట్టుకు రూ.10,016 ద్వితీయ బహుమతి, చల్వాయి గ్రామ జట్టుకు రూ.5,016 తృతీయ, గంగారం గ్రామ జట్టుకు 3,016 నాలుగో బహుమతిని సీతక్క అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆటలు ఆడడం వల్ల మానసిక, శరీరక, సామాజిక అభివృద్ధి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, ఇండియా వాలీబాల్ మహిళా జట్టు కోచ్ కోసరి కృష్ణప్రసాద్, భేతి రవీందర్‌రెడ్డి, చుంచు రమణ, తమ్మివెట్టి శ్రీను, ఏదుల వేణు, మేకల కృష్ణ, తాటి సుమన్, కన్నెబోయిన సతీశ్, మద్దెల శ్రీనివాస్, సాయబోయిన భిక్షపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సీతక్క
విజేతలకు బహుమతుల ప్రదానం
Comments
Please login to add a commentAdd a comment