సర్వే పారదర్శకంగా చేపట్టండి
ఏటూరునాగారం: నేటి (గురువారం) నుంచి జరగనున్న రైతు భరోసా, ఇందిరమ్మ అత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం అర్హుల ఎంపిక సర్వేను పారదర్శకంగా చేపట్టాలని మండల ప్రత్యేక అధికారి, సివిల్ సప్లయీస్ డీఎం శ్రీరామ్‌పతి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సర్వేలపై కో–ఆర్డి నేషన్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగు పథకాలను పారదర్శంగా ప్రజలకు అందజేయాలనే ఉద్దేశ్యంతో నాలుగు రోజుల పాటు సర్వే చేపట్టిందన్నారు. కుల గణన ద్వారా ఇప్పటికే వివరాలు సేకరించామన్నారు. అన్నిశాఖల అధికారులు టీంలుగా విడిపోయి అర్హులైన వ్యక్తులను గుర్తించడం జరుగుతుందన్నారు. అనర్హులను అర్హులుగా నమోదు చేస్తే సంబంధిత సర్వే టీం సభ్యుడు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
కమిటీల ఏర్పాటు
పంచాయతీ కార్యదర్శులు, గ్రామ స్పెషల్ ఆఫీసర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, హౌసింగ్ డిపార్ట్‌మెంట్ అధికారులు, మండల తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, వ్యవసాయ అధికారులు, ఏపీఓలు, ఏపీఎంలు సర్వే కమిటీగా ఏర్పాటై సర్వే చేస్తారని పేర్కొన్నారు. నాలుగు రోజుల సర్వే అనంతరం గ్రామ పంచాయతీల్లో ఈసర్వేలపై గ్రామ సభలు ఉంటాయని పేర్కొన్నారు. అప్పుడు గ్రామస్తులంతా ఈపేర్లను గుర్తించి అర్హులు, అనర్హులు అనేది తేల్చాల్సి ఉంటుందన్నారు. సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. అట్టడుగు స్థాయి ఉన్న వారికే ప్రభుత్వం ఈపథకాన్ని వర్తింపజేస్తోందన్నారు. కుటుంబానికి రూ.1.50 లక్షల వార్షిక ఆదాయం ఉంటే వారికి రేషన్ కార్డు వస్తుందని తెలిపారు. సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు, వ్యవసాయం సాగులో ఉన్న పట్టాదారుడికి రైతు భరోసా వస్తుందని తెలిపారు.
అధికారులతో కో–ఆర్డినేషన్ సమావేశం
సివిల్ సపయీస్ డీఎం శ్రీరాంపతి
Comments
Please login to add a commentAdd a comment