శుక్రవారం శ్రీ 17 శ్రీ జనవరి శ్రీ 2025
వెంకటాపురం(ఎం): జాతీయ విద్యా విధానంలో భాగంగా దేశంలో ప్రతీ విద్యార్థి విద్యార్హతల వివరాలు ఒకే కార్డులో నిక్షిప్తం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) విధానాన్ని ప్రవేశపెట్టింది. వన్ నేషన్ వన్ స్టూడెంట్ పేరిట ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు చదువుకునే విద్యార్థులకు ఈ గుర్తింపు కార్డును ఇవ్వనున్నారు.
జిల్లాలోని 9మండలాల పరిధిలో 568 పాఠశాలలు ఉండగా 41,997 మంది విద్యార్థులు ఉన్నారు. రెండు నెలలుగా పాఠశాలల్లో అపార్ నమోదు చేపడుతుండగా ఇప్పటి వరకు 5,398 మ ంది వివరాలు మాత్రమే ఉపాధ్యాయులు అపార్‌లో నమోదు చేశారు. ఈ నెల 31 లోపు అన్ని పాఠశాలల్లో విద్యార్థుల వివరాలు పూర్తి చేయాలని ప్ర భుత్వం గడువు విధించినా జాప్యం జరుగుతోంది.
పాఠశాల రికార్డుల్లో మార్పులు చేసుకోవచ్చు
గతంలో విద్యార్థుల వివరాలు స్కూల్ రికార్డులో తప్పుగా నమోదైతే మార్పులు చేసుకునేందుకు అవకాశం లేదు. ప్రస్తుతం మార్పులు చేసుకునేందుకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తల్లిదండ్రుల కోరిక మేరకు జనన ధ్రువీకరణ పత్రం లేదా ఆధార్ కార్డును అనుసరించి ప్రాథమికోన్నత, ప్రాథమిక, మోడల్, కేజీబీవీ, ప్రైవేట్ స్కూళ్లల్లోని అడ్మిషన్ రిజిస్టర్‌లో మార్పులు చేసేందుకు ఎంఈఓలకు, ఉన్నత పాఠశాలల్లో డీఈఓలకు మార్పు చేసే అధికారాన్ని విద్యాశాఖ కల్పించింది.
అపార్ నమోదును త్వరితగతిన పూర్తి చేయాలి
జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థుల అపార్ నమోదును త్వరితగతిన పూర్తి చేసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి. అపార్ నమోదు కాకముందే విద్యార్థుల వివరాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒకసారి అపార్‌లో విద్యార్థుల వివరాలు నమోదైతే మార్చుకునేందుకు అవకాశం ఉండదు. అపార్‌లో డిజి లాకర్ ద్వారా విద్యార్థి వివరాలు నిక్షిప్తం కావడంతో భవిష్యత్తులో అపార్ ఐడి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. – అర్షం రాజు, సమగ్ర శిక్ష జిల్లా సెక్టోరల్ అధికారి
న్యూస్‌రీల్
జిల్లాలోని పాఠశాలలు, విద్యార్థుల వివరాలు
మండలం పాఠశాలలు విద్యార్థులు అపార్
నమోదు
ములుగు 104 11,301 966
వెంకటాపురం(ఎం) 56 3,469 394
గోవిందరావుపేట 54 4,291 440
ఎస్‌ఎస్‌తాడ్వాయి 65 3,247 519
ఏటూరునాగారం 55 5,436 491
కన్నాయిగూడెం 29 1,399 66
మంగపేట 78 5,748 992
వాజేడు 59 2,617 770
వెంకటాపురం(కె) 68 4,489 760
అపార్ కార్డు అంటే..
మన దేశంలోని పౌరులకు ఇస్తున్న ఆధార్‌కార్డు లాంటిదే అపార్ కార్డు. విద్యార్థికి ఇది అకాడమిక్ పాస్‌పోర్టు లాంటిది. అపార్ గుర్తింపు కార్డు కోసం విద్యార్థుల వివరాలు తీసుకుంటున్నందున తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేశారు. అపార్‌లో విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, లింగం, పాస్‌ఫొటో, క్యూఆర్ కోడ్, 12అంకెలతో కూడిన గుర్తింపు సంఖ్య ఉంటుంది. ఈ కార్డుపై ఉన్న నంబరు కేంద్ర, రాష్ట్ర విద్యా శాఖల వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారు. దీంతో ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు స్టూడెంట్ ఎక్కడ చదివారు.. ఏ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి.. వ్యక్తిగత వివరాలన్నీ ఇట్టే ప్రత్యక్షమవుతాయి. అపార్ గుర్తింపుతో డిజిటల్ లాకర్‌కు అనుసంధానం అవుతారు. విద్యార్థులు కూడా అన్ని ధ్రువీకరణ పత్రాలను భద్రపరుచుకోవచ్చు. పాఠశాల మారినా ఇబ్బంది ఉండదు. విద్యార్థులు పొందుతున్న ఉపకార వేతనాలు, ఇతర ప్రయోజనాలు, వివిధ విద్యాసంస్థల్లో చేరికలు, మార్పులు, ఉద్యోగాల భర్తీ సమయంలో, ఇతర అంశాల్లో కూడా అపార్ కార్డు ప్రామాణికం కానుంది.
ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు వన్ నేషన్.. వన్ స్టూడెంట్ కార్డు
పాఠశాలల్లో విద్యార్థుల వివరాలు నమోదు
జిల్లా వ్యాప్తంగా 568 పాఠశాలలు
41,997మంది విద్యార్థులు
ఇప్పటి వరకు
5,398 మంది వివరాల నమోదు
పాఠశాల రికార్డుల్లో
మార్పులు చేసుకునేందుకు అవకాశం
Comments
Please login to add a commentAdd a comment