రూ.80వేలు అపహరణ
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని 8వ వార్డుకు చెందిన వడ్డెపల్లి శ్రీనివాస్ ఇంట్లో మంగళవారం రాత్రి దొంగలు చొరబడి రూ.80వేల నగదును ఎత్తుకెళ్లారు. ఈ విషయం గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఇంట్లో మంగళవారం రాత్రి నిద్రిస్తుండగా బీరువాలో ఉన్న నగదును గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. ఇంటి నిర్మాణానికి అప్పుగా తెచ్చుకున్న నగదును బీరువాలో పెట్టామని వెల్లడించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.
‘న్యాయ కళాశాల కోసం ఉద్యమిస్తాం’
వెంకటాపురం(కె): భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటుకు ఉద్యమిస్తామని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు పూనెం సాయి అన్నారు. మండల కేంద్రంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం కేంద్రంగా న్యాయ కళాశాల ఏర్పాటు చేస్తే ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ ఆదివాసీ యువతకు న్యాయం చేకూరుతుందని తెలిపారు. ఆదివాసీ యువత చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏజెన్సీలో ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కారం ఆనంద్, శంకర్ పాల్గొన్నారు.
‘అసత్య ప్రచారం
నమ్మి మోసపోవద్దు’
ములుగు: ప్రభుత్వం కొత్త మీసేవ సెంటర్లను ఏర్పాటు చేయబోతుందని అందుకు మీసేవ వెబ్‌సైట్ లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని జిల్లా ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే మీసేవ సెంటర్ నిర్వహణకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సందేశం పంపుతూ మోసగాళ్లు నకిలీ మీసేవ పోర్టల్‌ను కూడా రూపొందించారని వెల్లడించారు. ఆ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా సందేశం పంపుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంపై కేసు దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ నకిలీ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఈ నకిలీ వెబ్‌సైట్‌కి ఎలాంటి వ్యక్తిగత సమాచారం ఇవ్వద్దని, డబ్బులు చెల్లింపులు చేసి మోసపోవద్దని తెలిపారు.
రేపు సన్నాహక సభ
ములుగు రూరల్: రేపు(శనివారం) జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన వెయ్యి గొంతులు.. లక్ష డప్పుల సన్నాహక సభను రాజకీయాలకు అతీ తంగా విజయవంతం చేయాలని ఎమ్మార్పీస్ జాతీయ నాయకుడు ఇరుగు పైడి మాదిగ పిలుపునిచ్చారు. మండల పరిధిలోని కాశిందేవిపేటలో గురువారం ఆయన సంఘం నాయకులతో కలిసి పర్యటించి సభ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన సభకు ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హాజరవుతున్నారని తెలిపారు. ఈ సన్నాహక సభకు మాదిగలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలు పునిచ్చారు. అదే విధంగా ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో మహాసభ ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోల్కొండ బుచ్చన్న, రేలా కుమార్, మడిపెల్లి శ్యాంబాబు, సుధాకర్, భిక్షపతి, సంజీవ, ప్రభాకర్, అనిల్ పాల్గొన్నారు.
డిప్యూటీ జనరల్ సెక్రటరీగా వేణుగోపాల్
భూపాలపల్లి అర్బన్: కోల్ మైన్ లేబర్ యూనియన్(ఐఎన్‌టీయూసీ) డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఏరియాకు చెందిన వేణుగోపాల్ ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర కమిటీ నియామకం చేపట్టగా గురువారం యూనియన్ ప్రధాన కార్యదర్శి, మినిమం వేజేస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ జనక్‌ప్రసాద్ నియామక పత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment