క్రీడలతో మానసికోల్లాసం
ములుగు రూరల్: క్రీడలు మానసికోల్లాసానికి దోహదపడతాయని ఏబీవీపీ జిల్లా కార్యదర్శి మమన్‌యాదవ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం జాకారంలోని గిరిజన విశ్వవిద్యాలయంలో క్రీడోత్సవ్ –2025 వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో శారీరక, మానసిక ధృడత్వానికి క్రీడలు ఎంతో అవసరమన్నారు. ఖేలో భారత్ పేరుతో దేశవ్యాప్తంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో గ్రామీణ, పట్టణ స్థాయి వరకు క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. రేపటి నుంచి 30వ తేదీ వరకు వివేకానంద, సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాయిరాం, స్వామి, కై లాసం తదితరులు పాల్గొన్నారు.
కోతిని తప్పించబోయి..
● చెట్టును ఢీకొట్టిన కారు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని మేడారం సమ్మక్క– సారలమ్మ దర్శనానికి వెళ్తున్న క్రమంలో పస్రా–తాడ్వాయి మధ్యలో ఓ కారు రోడ్డుపైకి వచ్చిన కోతిని తప్పించే క్రమంలో అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇరిగేషన్ డీఈ శ్రీనివాస్ బంధువులతో కలిసి భద్రాచలానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. అనంతరం మేడారంలోని వనదేవతల దర్శనం నిమిత్తం వెళ్తుండగా పస్రా– తాడ్వాయి మధ్య జాతీయ రహదారిపైకి వచ్చిన కోతిని తప్పించే క్రమంలో కారు అదుపు తప్పింది. రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ క్రమంలో కారులో ఉన్న ఐదుగురికి చిన్నపాటి గాయాలయ్యాయి. ఇదే క్రమంలో ఏటూరునాగారం నుంచి ములుగు వెళ్తున్న పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ రాంపతి వారిని గమనించి ఆగారు. 108కు సమాచారం అందించి గాయపడిన వారిని తన వాహనంలో పస్రా చెక్‌పోస్టు వరకు తీసుకెళ్లారు. అక్కడికి ఎదురుగా 108 అంబులెన్స్ రాగా వారిని వైద్య చికిత్స నిమిత్తం ములుగు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం రాంపతి మరో వాహనాన్ని పిలిపించి డీఈతో పాటు బంధువులను ఆదిలాబాద్‌కు తరలించి మానవత్వం చాటుకున్నారు.
రాష్ట్ర మహాసభలను
విజయవంతం చేయాలి
ములుగు రూరల్: ఈ నెల 25నుంచి 28వ తేదీ వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సీపీఎం 4వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాయలంలో మహాసభల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేఖ విధానాలపై మహాసభలో చర్చించనున్నట్లు తెలిపారు. పేద ప్రజలపై ఆర్థిక భారం మోపుతూ మతోన్మాద భావజాలాన్ని పెంపొందిస్తున్న సమస్యలకు పరిష్కారంపై ఆలోచనం చేయనున్నట్లు వెల్ల డించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీల అమలచేస్తామని చెప్పి కాలయాపన చేస్తుందన్నారు. ఈ రాష్ట్ర మహాసభలకు సీపీఎం అఖిల భారత కోఆర్డినేటర్ ప్రకాష్‌శరత్, పొలిటీకల్ బ్యూరో సభ్యులు కోఆర్డినేటర్ బృందాకారత్, బీవీ రాఘవులు, విజయ్ రాఘవన్ హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రత్నం రాజేందర్, మండల కార్యదర్శి ఎండి గఫూర్, రత్నం ప్రవీణ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి
వెంకటాపురం(కె): రహదారి పనులపై నిర్లక్ష్యం వహిస్తున్న రోడ్డు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ అన్నారు. మండల కేంద్రంలో సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాజేడు నుంచి వెంకటాపురం మండలం ఎదిర వరకు రూ.44 కోట్లతో రోడ్డు మరమ్మతు పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. పనులు చేయడంలో నిర్లక్ష్యంచేస్తున్న కాంట్రాక్టర్ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment