ఉమామహేశ్వర రిజర్వాయర్‌ను రద్దుచేయాలి | Sakshi
Sakshi News home page

ఉమామహేశ్వర రిజర్వాయర్‌ను రద్దుచేయాలి

Published Tue, May 7 2024 5:45 AM

ఉమామహేశ్వర రిజర్వాయర్‌ను రద్దుచేయాలి

లేనిపక్షంలో

పార్లమెంట్‌ ఎన్నికలను

బహిష్కరిస్తామని రైతుల తీర్మానం

బల్మూర్‌: ఉమామహేశ్వర రిజర్వాయర్‌ అనుమతులను వెంటనే రద్దుచేయాలని.. లేనిపక్షంలో పార్లమెంట్‌ ఎన్నికలను బహిష్కరిస్తామని రైతులు తేల్చిచెప్పారు. ఈమేరకు సోమవారం బల్మూర్‌లో రిజర్వాయర్‌ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. అనంతరం కలెక్టరేట్‌కు చేరుకొని అధికారులకు తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ ఉమామహేశ్వర రిజర్వాయర్‌ నిర్మాణంతో అనంతవరం, బల్మూర్‌, మైలారం గ్రామాలకు చెందిన రైతుల భూములు సుమారు 2 వేల ఎకరాలు ముంపునకు గురవుతాయని తెలిపారు. రైతుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా రిజర్వాయర్‌ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంతో పాటు నిధులు మంజూరు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రిజర్వాయర్‌తో రైతులు రోడ్డున పడటంతో పాటు గ్రామాల ఉనికికే ముప్పు ఉంటుందన్నారు. రిజర్వాయర్‌ అనుమతులను రద్దుచేస్తేనే, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు అనంత సీతారాంరెడ్డి, ఉపాధ్యక్షులు తిరుపతయ్య, రాసమోని మహేష్‌, రేణు, ప్రధానకార్యదర్శి వర్కాల రాములు, నాగయ్య, జానకీ రాములు ఖదీర్‌, లాల్‌ అహ్మద్‌, బాలకృష్ణ, శివశంకర్‌ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement