దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Published Fri, Sep 27 2024 1:08 AM | Last Updated on Fri, Sep 27 2024 1:08 AM

దరఖాస

నాగర్‌కర్నూల్‌ (బిజినేపల్లి): తెలంగాణ గిరిజన బాలికల మినీ, గురుకులం బిజినేపల్లి, అమ్రాబాద్‌ మండలాల్లో కిచెన్‌ హెల్పర్‌, గణిత కేర్‌ టేకర్‌ టీచర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు వచ్చే నెల 3 వరకు దరఖాస్తులను బిజినేపల్లి మినీ గురుకులంలో అందించాలని సూచించారు. దరఖాస్తు ఫారాలను బిజినేపల్లి మినీ గురుకులంలోనే తీసుకోవాలని, పూర్తి సమాచారం కోసం సెల్‌ నం.94910 30263ను సంప్రదించాలని చెప్పారు.

ప్రజా రక్షణే ధ్యేయంగా పనిచేయాలి

నాగర్‌కర్నూల్‌ క్రైం/ కొల్లాపూర్‌/ పెద్దకొత్తపల్లి: ప్రజా రక్షణే ధ్యేయంగా పోలీసులు పనిచేయాలని డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌ అన్నారు. గురువారం ఆయన ఎస్పీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి.. ఎస్పీ కార్యాలయంలో అన్ని విభాగాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పోలీసులకు మంచి పేరు తీసుకువచ్చేలా.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేసేలా చూడాలన్నారు. ఎక్కడ ఏ సమస్య ఎదురైనా పోలీసుల దృష్టికి వచ్చిన వెంటనే స్పందించాలన్నారు. జిల్లాలో నేర నియంత్రణ కోసం సిబ్బంది కృషిచేయాలన్నారు. అనంతరం కొల్లాపూర్‌లో సీఐ కార్యాలయంతోపాటు పెద్దకొత్తపల్లిలో పోలీస్‌స్టేషన్‌ సందర్శించి రికార్డులు పరిశీలించారు. సర్కిల్‌ పరిధిలోని క్రైమ్‌ వివరాలను సీఐ మహేష్‌ను అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీశారు. పెద్దకొత్తపల్లి పోలీస్‌ స్టేషన్‌లో రికార్డులు, నేరాలు, చోరీ అయిన సొమ్ము రికవరీ వివరాలను డీఎస్పీ శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆయా ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, ఏఎస్పీ రామేశ్వర్‌, ఏఆర్‌ ఏఎస్పీ భరత్‌, సీఐ మహేష్‌, ఎస్‌ఐ సతీష్‌ పాల్గొన్నారు.

ఇయర్‌ ఫోన్స్‌

వాడకాన్ని తగ్గించాలి

నాగర్‌కర్నూల్‌ క్రైం: ఇయర్‌ ఫోన్స్‌ వాడకాన్ని తగ్గించి చెవిటితనాన్ని నివారించాలని డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మి అన్నారు. గురువారం జాతీయ చెవిటి తనం నివారణ, నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాత కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో డీఎంహెచ్‌ఓ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దైనందిన జీవితంలో ప్రతిఒక్కరూ మొబైల్‌ విరివిగా వాడుతున్నారని, ఈ క్రమంలోనే ఇయర్‌, హెడ్‌ ఫోన్స్‌, బ్లూటూత్‌ ఎక్కువ సేపు వినియోగించరాదన్నారు. వీటిని ఎక్కువసేపు వినియోగించడం వల్ల చెవి వినికిడి సమస్యలు ఎదురవుతాయన్నారు. ఎవరికై నా చెవి పోటు, చెవిలో చీము కారడం తదితర సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. శబ్ధ తీవ్రత 100 డేసిబుల్స్‌ కంటే ఎక్కువగా ఉన్న వాటిని వినడం వల్ల చెవిటితనానికి దారి తీయవచ్చని, సౌండ్‌ వాడకాన్ని ప్రోత్సహించవద్దని చెప్పారు. శబ్ధ కాలుష్యం వల్ల మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు వస్తాయని, చిన్నారుల్లో స్క్రీన్‌ టైం (మొబైల్‌, ట్యాబ్‌ చూడడం) వినియోగాన్ని ప్రోత్సహించకూడదన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు వెంకటదాసు, శ్రీని వాసులు, కృష్ణమోహన్‌, రవికుమార్‌, నారాయణస్వామి, డీపీఓ రేణయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
దరఖాస్తుల ఆహ్వానం 
1
1/1

దరఖాస్తుల ఆహ్వానం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement