నా మాటే శాసనం..!
వనపర్తిపై ‘కొల్లాపూర్’ నేతల పెత్తనం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘ఇది నా మాట.. నా మాటే శాసనం’.. ఇది ఓ సినిమాలోని డైలాగ్. దీన్ని వణికిపుచ్చుకున్నట్టున్నారు ఉమ్మడి పాలమూరుకు చెందిన కొందరు కీలక నేతలు. తమ మాటే శిరోధార్యం.. అందరూ పాటించాల్సిందే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కీలక ప్రజాప్రతినిధుల నీడన వారి ముఖ్య అనుచరులు సైతం చాప కింద నీరులా తమ ప్రాభవాన్ని చాటుతూ.. పెత్తనం చెలాయిస్తున్నారు. పార్టీపరమైన వ్యవహారాలతో పాటు పలు ప్రభుత్వ శాఖల్లో పోస్టింగ్‌లు, ఔట్ సోర్సింగ్ నియామకాల్లో తలదూరుస్తూ చక్రం తిప్పుతున్నారు. పోలీస్‌స్టేషన్లలో పేచీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో తదితర పనులకు సంబంధించి తమ హవానే కొనసాగిస్తూ.. పై‘చేయి’ సాధిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు కేడర్‌లో అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది.
గద్వాల, నాగర్‌కర్నూల్‌లో..
గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్, డీసీసీ అధ్యక్షురాలు సరిత మధ్య వైరం కొనసాగుతోంది. కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడానికి కొల్లాపూర్‌కు చెందిన కీలకనేతనే కారణమని పార్టీలో ఇదివరకే ప్రచారం ఉంది. ఈ క్రమంలో సరితను కాదని ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తికి మార్కెట్ చైర్మన్ పదవి ఇవ్వడం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోనూ ఆయన వర్గానికే ప్రాధాన్యం ఇవ్వడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ జిల్లాతో పాటు నాగర్‌కర్నూల్‌లో ప్రభుత్వ శాఖల అధికారులు, పోస్టింగ్‌లు, పైరవీలు ఇతరత్రా అంశాల్లో సదరు కీలకనేత, ఆయన అనుచరులదే పైచేయిగా నిలవడంతో స్థానిక నేతలు, శ్రేణులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
నాగర్‌కర్నూల్‌తోపాటు గద్వాల జిల్లాపై సైతం..
నారాయణపేటపై ‘కొడంగల్’ ముద్ర
స్థానిక ప్రజాప్రతినిధులు, శ్రేణుల్లో అసంతృప్తి
ఒత్తిళ్లతో తలపట్టుకుంటున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment