వాతావరణం
అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతం అవుతుంది. ఉదయం, రాత్రి చలి ఉంటుంది. మంచు కురుస్తుంది.
ఒంటికాలిపై
నిలబడి నిరసన
కందనూలు: జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలో ఆదివారం సమగ్రశిక్ష ఉద్యోగులు ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్రశిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె 20వ రోజుకు చేరింది. సమ్మె శిబిరంలో కొల్లాపూర్ పట్టణానికి చెందిన వివిధ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాల్గొని సంఘీభావం ప్రకటించాయి. ఈ సందర్భంగా సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం జేఏసీ జిల్లా అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ.. 15 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు అన్ని అనర్హతలు ఉన్నప్పటికీ ఉద్యోగ భద్రతకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య, ప్రమాద బీమా సౌకర్యాలు కూడా లేవన్నారు. ప్రభుత్వం తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించడంతో పాటు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.
మత్స్య సంపదను
కొల్లగొడితే సహించం
కొల్లాపూర్ రూరల్: కొల్లాపూర్ ప్రాంతంలోని కృష్ణానదిలో మత్స్య సంపదను కొల్లగొడితే సహించమని జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు వాకిటి ఆంజనేయులు అన్నారు. ఆదివారం సింగోటంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొల్లాపూర్ నియోజకవర్గంలోని అయ్యవారిపల్లి, కాలూరు, జటప్రోలు, మంచాలకట్ట, మల్లేశ్వరం, సోమశిల, అమరగిరి కోతిగుండు, అంకాలమ్మ కోట, లింగమయ్య పెంట గ్రామాల సమీపంలోని కృష్ణానది బ్యాక్ వాటర్‌లో ఇతర ప్రాంతాలకు చెందిన వారు అలివి, చార్మిన్ వలలతో చేపపిల్లలను వేటాడుతూ.. ఈ ప్రాంతానికి చెందిన 10వేల మంది మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మత్స్యసంపద దోపిడీని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. సమావేశంలో సంఘం సభ్యులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment