అడుగడుగునా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు..
అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో ప్రత్యేకంగా డ్రంకెన్ డ్రైవ్‌పై తనిఖీలు నిర్వహించనున్నాం. తాగి బండి నడిపితే కేసులు నమోదు చేస్తాం. జిల్లావ్యాప్తంగా అడుగడుగునా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించనున్నాం. కాబట్టి మద్యం తాగి రోడ్ల మీదకు వచ్చి చిక్కులు తెచ్చుకోవద్దు. ఈసారి రోడ్డు ప్రమాదాలు జరగకుండా, ప్రశాంత వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ రోజున ఒక్క ఆక్సిడెంట్ కూడా జరగొద్దు. ఇందుకోసం మా పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశాం. డిసెంబర్ 31, న్యూ ఇయర్ రోజున అన్ని స్థాయిల్లో పోలీస్ అధికారులు బందోబస్తును పర్యవేక్షిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment