ఈ ఏడాది కొందరు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్ల వ్యవహార తీరు వివాదాస్పదంగా మారింది. వనపర్తి జిల్లా పాన్‌గల్‌లో పనిచేసిన ఎస్‌ఐ నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఓ వాహనదారుడిపై అకారణంగా దాడికి పాల్పడ్డాడు. లింగాలలో పనిచేసిన ఓ ఎస్‌ఐ యువకుడికి శిరోముండనం చేయించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు. ఈ రెండు ఘటనలు వివాదాస్పదంగా మారాయి. బిజినేపల్లి పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌తో పాటు జిల్లా కేంద్రంలో బ్లూకోర్టులో పనిచేస్తున్న మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఒంటరిగా ఉన్న జంటల నుంచి నగదు వసూలు చేశారన్న ఆరోపణలు రావడంతో వారిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment