ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించొద్దు
కల్వకుర్తి టౌన్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆర్‌ఎం సంతోష్‌కుమార్ అన్నారు. గురువారం అచ్చంపేటలోని బస్టాండ్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పండుగ సమయాల్లో డిపో పరిధి నుంచి నడుపుతున్న స్పెషల్ బస్సులతోపాటు సాధారణ ప్రయాణికులకు నడుపుతున్న సర్వీసుల వివరాలను డిపో మేనేజర్ సుభాషిణిని అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరేందుకు కంట్రోల్ రూం నిర్వహణ సరిగా ఉండాలని సూచించారు. అనంతరం బస్టాండ్‌లోని పరిసరాలను పరిశీలించి, మూత్రశాలలు, పార్కింగ్, ఇతర సదుపాయాల వివరాలపై ఆరాతీశారు. బస్టాండ్లలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో తినుబండారాలను ఎమ్మార్పీలకే విక్రయించాలని, లేదంటే ఫిర్యాదుల ఆధారంగా నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే డిపోలో పండుగ స్పెషల్‌లో వచ్చిన ఆక్యుపెన్సీని ఆర్‌ఎంకు డీఎం వివరించారు. ఆయన వెంట డిపో ఎస్టీఐ శ్వేత, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment