రాబడి తగ్గింది ఈ ప్రాంతాల్లోనే..
2023 (ఏప్రిల్–డిసెంబర్)తో పోలిస్తే 2024లో ఏడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో రాబడి తగ్గింది. మొత్తంగా 36.29 శాతం మేర ఆదాయం తగ్గినట్లు రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. వనపర్తి (24.98 శాతం), అలంపూర్ (24.01 శాతం), మక్తల్ (22.54 శాతం), జడ్చర్ల (15.37 శాతం), మహబూబ్‌నగర్ (8.93 శాతం), ఆత్మకూర్ (8.85 శాతం), నారాయణపేట (1.32 శాతం) రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రెవెన్యూ తగ్గింది.
25% మార్టిగేజ్ దస్తావేజులే..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నాలుగైదు కా ర్యాలయాల్లో మాత్రమే సాధారణంగా దస్తావేజులు నమోదయ్యాయి. వీటిలో ఎక్కువ శాతం మార్టిగేజ్ దస్తావేజులు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లతో పాటు ప్రైవే ట్ బ్యాంక్‌లు, పలు ఫైనా న్స్ సంస్థలు ఇంటి స్థలా లు, ఇళ్ల నిర్మాణాలపై వడ్డీలకు రుణాలందిస్తున్నాయి. ఈ మేరకు జమానత్ కోసం వారి దస్తావేజులను మార్టి గేజ్ చేయించుకుంటున్నారు. అన్ని కార్యాలయాల్లో ఇలాంటి దస్తావేజులే 25 శాతం మేర నమోదవుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment