విద్యుత్‌ తీగలు తగిలి గేదెలు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ తీగలు తగిలి గేదెలు మృతి

Published Fri, Jul 7 2023 11:32 AM | Last Updated on Fri, Jul 7 2023 11:32 AM

- - Sakshi

హుజూర్‌నపగర్‌రూరల్‌: వ్యవసాయ భూమిలో కిందకు వేలాడుతున్న విద్యుత్‌ తీగలు తగిలి ఐదు పాడి గేదెలు మృతిచెందిన ఘటన హుజూర్‌నగర్‌ మండలంలోని బూరుగడ్డ గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. బూరుగడ్డ గ్రామ శివారులోని ఓ రైతు వ్యవసాయ భూమిలో కిందకు వేలాడుతున్న విద్యుత్‌ తీగలు తగిలి చిలుకూరు మండలం సీతరాంతండాకు చెందిన గుగులోతు బోజ్యానాయక్‌ చెందిన 2 గేదెలు, గుగులోత్‌ రవీందర్‌నాయక్‌కు చెందిన 2 గేదెలు, గరిడేపల్లి మండలం కట్టవారిగూడెం గ్రామానికి చెందిన బాల్దూరి సత్యనారాయణకు చెందిన ఒక పాడి గేదె మృతిచెందాయి. మృతిచెందని గేదెల విలు రూ.2.50లక్షలు ఉంటాయని బాధిత రైతులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement