నా ఇంటిలో గెట్టు పెడుతున్నారు | Sakshi
Sakshi News home page

నా ఇంటిలో గెట్టు పెడుతున్నారు

Published Sat, Apr 20 2024 1:45 AM

- - Sakshi

ఇరవై ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకుని జీవిస్తున్నాం. నా తండ్రి కాలం చేయడంతో ఆ ఇల్లు వారసత్వంగా నాకు వచ్చింది. ఇరవై ఏళ్లుగా ఇంటి పన్ను కడుతూనే ఉన్నా. కానీ, ఇప్పుడు పెద్ద మనుషులు వచ్చి ఆ స్థలం నీకు ఇవ్వాలంటే రూ.70 వేలు ఇవ్వు అని బెదిరిస్తున్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టిన చర్యలు తీసుకోవాలి.

– తిప్పన క్రిష్ణారెడ్డి (లక్ష్మీపురం)

ప్రభుత్వ భూమిని

కబ్జా చేస్తే ఉపేక్షించం

ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైన విషయం నా దృష్టికి రాలేదు. లక్ష్మీపురం గ్రామంలో సర్వే నంబర్‌ 437లో ఉన్న 4.24 ఎకరాల భూమిలో కొంత భాగాన్ని 20 మంది లబ్ధిదారులకు కేటాయించగా మిగిలిన భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అర్హులైన వారిని ఎంపిక చేసి ప్రభుత్వం ద్వారానే ఆ భూమిని పంపిణీ చేస్తాం. కబ్జాలకు పాల్పడితే రెవెన్యూ యాక్ట్‌ ప్రకారం చర్యలు తీసుకుంటాం.

– శ్రీనివాస్‌రావు, ఆర్డీఓ, మిర్యాలగూడ

1/1

Advertisement
Advertisement