28న జాతీయ లోక్‌అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

28న జాతీయ లోక్‌అదాలత్‌

Published Fri, Sep 27 2024 1:34 AM | Last Updated on Fri, Sep 27 2024 1:34 AM

28న జ

రామగిరి(నల్లగొండ): న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. లోక్‌ అదాలత్‌లో రాజీ పడదగిన క్రిమినల్‌, వెహికిల్‌ ప్రమాద, బ్యాంకు రికవరీ, చెక్‌ బౌన్స్‌, భూ వివాదాలు, వినియోదారులు కేసులు, ఇతర సివిల్‌ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.

పిటీషన్‌ మేనేజ్‌మెంట్‌లో ప్రశంసాపత్రం

మిర్యాలగూడ అర్బన్‌: పిటీషన్‌ మేనేజ్‌మెంట్‌, ఎంక్వయిరీ విభాగంలో అత్యుత్తమ పనితీరు కనపరుస్తూ, ప్రజలకు ఉత్తమ సేవలందించినందుకు మిర్యాలగూడ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో మొత్తం ఐదు పోలీస్‌ స్టేషన్లను ఎంపిక చేయగా మిర్యాలగూడ టూటౌన్‌ పోలీస స్టేషన్‌ రెండవ స్థానంలో నిలిచింది. దీంతో గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర డీజీపీ జితేందర్‌ చేతుల మీదుగా ఎస్‌ఐ రాంబాబు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. మిర్యాలగూడ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు ఉత్తమ సేవల్లో రాష్ట్రంలో రెండో స్థానం రావడం పట్ల స్టేషన్‌ సిబ్బందికి జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ అభినందనలు తెలిపారు.

దర్వేశిపురం ఆలయ నూతన చైర్మన్‌గా వెంకట్‌రెడ్డి

కనగల్‌: మండలంలోని దర్వేశిపురం(పర్వతగిరి) శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయ నూతన చైర్మన్‌గా దర్వేశిపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ సర్పంచ్‌ చీదేటి వెంకట్‌రెడ్డి పేరును మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఖరారు చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో చైర్మన్‌ పేరును ప్రకటించారు. మంత్రిని కలిసిన వారిలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్‌ శ్రీనివాస్‌గౌడ్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దేవిరెడ్డి వెంకట్‌రెడ్డి, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజిరెడ్డి, నాగేష్‌, శంకర్‌రెడ్డి, పాపయ్య, శేఖర్‌, శివారెడ్డి ఉన్నారు.

రుణమాఫీ చేయాలని రైతుల రాస్తారోకో

చండూరు: రైతులందరికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ గురువారం చండూరు మండలం కొండాపురం గ్రామంలో రైతులు రాస్తారోకో చేశారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రైతులు నినాదాలు చేశారు. కొమ్ము గణేశ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు ఇరిగి రామలింగయ్య, గుణగంటి లింగయ్య, ఇర్గి ఎల్లయ్య, నరసింహ, ఓర్సు ఇద్దయ్య, ఇరిగి అంజమ్మ, మాదగోని ఎల్లమ్మ, సిలివేరు జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
28న జాతీయ లోక్‌అదాలత్‌
1
1/1

28న జాతీయ లోక్‌అదాలత్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement