నల్లగొండ : సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన ఇసుకను జాప్యం లేకుండా సరఫరా చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. శాలిగౌరారం మండలం వంగమర్తి ఇసుక రీచ్ నుంచి ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇసుకను ఇచ్చేందుకు జిల్లాస్థాయి ఇసుక కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. దేవరకొండ మండలం ముదిగొండ ఇసుక రీచ్ నుంచి డిండి, కిష్టరాంపల్లి ఎత్తిపోతల పథకాలకు లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకను సరఫరా చేసేందుకు ఆమోదం తెలిపామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా మైన్స్ శాఖ ఏడీ జాకబ్, జిల్లా పంచాయతీ అధికారి మురళి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీనివాస్‌రెడ్డి, ఎలమంద తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment