పెండింగ్ కేసులను పరిష్కరించాలి
నల్లగొండ క్రైం : పెండింగ్ కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీసు అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. కేసు నమోదు నుంచి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు. ఫోక్సో, గ్రేవ్ కేసుల్లో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు. ప్రతి అధికారికి పూర్తి ఇన్వెస్టిగేషన్, స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలన్నారు. ఫంక్షనల్ వర్టికల్స్ అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. ప్రమాదాల నివారణకు రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకుండా చూడాలని, అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, జూదం, ఇసుక, పీడీఎస్ అక్రమరవాణాను నియంత్రించాలన్నారు. జవాబు దారీగా ఉంటూ బాధితులకు సత్వర న్యాయం అందేలా పనిచేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ రాములునాయక్, ఎస్‌బీ డీఎస్పీ రమేష్, డీఎస్పీలు శివరాంరెడ్డి, రాజశేఖరరాజు, గిరిబాబు, సైదా, లక్ష్మీనారాయణ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్
Comments
Please login to add a commentAdd a comment