పత్తి సాగులో అధిక సాంద్రత పద్ధతి మేలు
పెన్‌పహాడ్: పత్తి సాగులో అధిక సాంద్రత పద్ధతి అవలంబించడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని కేవీకే శాస్త్రవేత్తలు కిరణ్, ఆదర్శ్ తెలిపారు. పెన్‌పహాడ్ మండల కేంద్రంలో శుక్రవారం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పత్తి సాగుపై క్షేత్ర దినోత్సవం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ.. అధిక సాంద్రత పద్ధతి పత్తి సాగు అవలంబించడం ద్వారా జాతీయ పత్తి పరిశోధన సంస్థ నాగపూర్ ఎంపిక చేసిన రైతుల ఖాతాల్లోకి నేరుగా విత్తనాల ఖర్చు, మెపిక్వాటుక్లోరైడ్ మందు ఖర్చు, సమగ్ర సస్యరక్షణ చర్యలకు అయ్యే ఖర్చు జమ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలు, దీపపు ఎర వాడే విధానాలను వివరించారు. పత్తితీత అనంతరం పత్తి కట్టెలను కాల్చకుండా కాటన్ శెడ్డర్‌ను చేసుకొని అదే నెలలో కలియ దున్నితే నేల సారం పెరగడమే కాకుండా గులాబీ రంగు పురుగు ఉధృతిని నివారించుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో యంగ్ ప్రొఫెషనల్స్ సంతోష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment