పోరాటాలకు సిద్ధం కావాలి
పెద్దవూర : ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కార్యకర్తలు పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పెద్దవూర మండల కేంద్రంలో నిర్వహించిన సీపీఎం మండల 8వ మహాసభలో ఆయన మాట్లాడారు. దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం జమిలీ ఎన్నికలు తీసుకురావడానికి ప్రయత్నించడం.. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి పూర్తిగా మోసం చేసిందన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కూన్‌రెడ్డి నాగిరెడ్డి, సీహెచ్ లక్ష్మీనారాయణ, నాయకులు కృష్ణారెడ్డి, దోరెపల్లి మల్లయ్య, దుబ్బ రామచంద్రయ్య, కొండేటి శ్రీను, కందుకూరి కోటేష్, ఎస్కే.బషీర్, పరమేష్, నాగార్జున, లచ్చునాయక్, కొండల్, ఆనంద్, రమేష్, లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment