ఫ్లోరోసిస్ సర్వే పక్కాగా నిర్వహించాలి
మర్రిగూడ: మండల వ్యాప్తంగా గురువారం నుంచి ఇంటింటా ఫ్లోరోసిస్ సర్వేను పక్కాగా నిర్వహించి ఫ్లోరోసిస్ బాధితులను గుర్తించి జిల్లా కేంద్రానికి నివేదిక అందించాలని డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మర్రిగూడ పీహెచ్‌సీలో ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లకు ఫ్లోరోసిస్ సర్వేపై శిక్షణ ఇచ్చారు. అనంతరం ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న మందులు, త్వరలో ప్రారంభించనున్న డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. కార్యక్రమంలో అడిషన్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, చండూరు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కల్యాణ్‌చక్రవర్తి, పీఓడీడీటీ కృష్ణకుమారి, ఆసుపత్రి సూపరింటెండెంట్ శంకర్‌నాయక్, వైద్యులు శాలిని, దీపక్, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment