ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాల్వలకు నిధులు
నకిరేకల్: నకిరేకల్ నియోజకవర్గంలోని ధర్మారెడ్డి కాల్వ పూర్తిచేయడానికి రూ.129 కోట్లు, పిలాయిపల్లి కాల్వకు రూ.95కోట్ల నిధులను మంజూరు చేయడంతో గురువారం అసెంబ్లీలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఈ రెండు కాల్వలు ఎప్పడు పూర్తవుతాయా అని ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మూసీ ఆయకట్టు కింద ఉన్న ఈ కాల్వలను పూర్తిచేయిస్తా అని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా యుద్ధప్రాతిపదికన పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలను పూర్తిచేయిస్తామని చెప్పారని అన్నారు. బ్రాహ్మణవెల్లెంల ఉదయసముద్రం ప్రాజెక్టుకు సంబంధించి కుడి, ఎడమ కాల్వల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, మరో రూ.70 కోట్లు నిధులు కావాలని అసెంబ్లీలో ఆయన ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
ఫ అసెంబ్లీలో ప్రభుత్వానికి
కృతజ్ఞతలు తెలిపిన నకిరేకల్
ఎమ్మెల్యే వేముల వీరేశం
ఫ బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుకు మరో రూ.70 కోట్లు ఇవ్వాలని అభ్యర్థన
Comments
Please login to add a commentAdd a comment