భూ సమస్యల పరిష్కారానికి.. మార్గం సుగమం
భూ సమస్యలు ప్రస్తావించిన రైతులు
పలువురు రైతులు తమ సమస్యలను ఫౌండేషన్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారు. పదేళ్లుగా భూ సమస్యలు పరిష్కారం కావట్లేదని కంబాలపల్లి గ్రామానికి చెందిన రైతు కనకటి కోటయ్య వాపోయాడు. రైతు బంధు లేక, బ్యాంకుల్లో లోన్లు ఇవ్వక, ఆపద సమయాల్లో భూమి అమ్మాలనుకున్నా కొనేవారు లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపాడు. రైతు బద్దెల సత్యనారాయణ మాట్లాడుతూ.. అక్రమంగా పట్టాలు చేసుకున్న రైతులు అన్ని విధాలుగా లబ్ధిపొందుతున్నారని, నిజమైన రైతులకు మేలు జరగడం లేదని పేర్కొన్నాడు. ఈమేరకు రైతు సేవా ఫౌండేషన్ చైర్మన్ సునిల్‌కుమార్ స్పందిస్తూ.. రైతులకు మేలు జరిగేలా ఈ చట్టాన్ని రూపకల్పన చేసినట్లు చెప్పారు. ధరణిలో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని పరిష్కరించలేకపోయారన్నారు. పూర్తిగా రైతుల సమస్యలు పరిష్కారానికే భూ భారతి తీసుకొచ్చినట్లు తెలిపారు. కంబాలపల్లి గ్రామాన్ని తాము దత్తత తీసుకొని సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అక్రమంగా వచ్చిన పట్టా లను తొలగించి నిజమైన రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
చందంపేట: భూ భారతి చట్టం– 2024తో భూసమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అయిందని, ఆర్డీఓ, తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కారమవుతాయని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, రైతు సేవా ఫౌండేషన్ చైర్మన్ సునిల్‌కుమార్ అన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా సోమవారం చందంపేట మండలం కంబాలపల్లి గ్రామంలోని రైతు వేదికలో రైతు సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ మాట్లాడుతూ.. భూ భారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు ఇక్కడి రైతులతో ముఖాముఖి ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల భూ సమస్యలు పరిష్కారానికి నోచుకోక పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు. కలెక్టర్ స్థాయిలో భూ సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతూ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకురానున్న భూ భారతి చట్టంతో భూ సమస్యల పరిష్కారంలో కాలయాపన ఉండదని అన్నారు.
18లక్షల ఎకరాల్లోని
భూ సమస్యలు పరిష్కారం
భూభారతి చట్టంతో ఈ చట్టంతో రాష్ట్రంలో 18లక్షల ఎకరాల్లోని భూ సమస్యలు పరిష్కారం కానున్నాయని ఫౌండేషన్ చైర్మన్ సునిల్‌కుమార్ తెలిపారు. ఏడాది వ్యవధిలో రైతుల నుంచి సేకరించిన సమాచారం, ఆన్‌లైన్‌లో పొందుపర్చిన సమాచారం ఆధారంగా సంబంధిత భూ యజమానికి ఇంటికే గ్రామ అధికారి వచ్చి సమాచారం నిర్ధారిస్తాడన్నారు. నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి, సాగర్, రంగారెడ్డి జిల్లాలోని యాచారం పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఫౌండేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి మాట్లాడుతూ. గ్రామానికి ఒక అధికారి ఉంటాడని, రైతుల సమస్యలు పరిష్కరించేందుకు విధులు నిర్వహిస్తాడని తెలిపారు. కలెక్టరేట్ చుట్టూ తిరగకుండా నియోజకవర్గ స్థాయి అధికారుల ద్వారా భూ సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. భూ భారతి చట్టం ఏర్పాటయ్యాక తొలి సమావేశం కంబాలపల్లిలో ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. సమావేశం ప్రారంభానికి ముందు మండలంలో రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న భూ సమస్యలపై తహసీల్దార్ శ్రీనివాస్ రైతు సేవా ఫౌండేషన్ సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమణారెడ్డి, నాయకులు నాయిని మాధవరెడ్డి, సిరాజ్‌ఖాన్, ముక్కమల వెంకటయ్య, సీపీఐ నాయకులు పల్లా నర్సింహారెడ్డి, జర్పుల బద్యానాయక్, ముత్యాల చంద్రశేఖర్, మాధవాచారి, బద్దెల సత్యనారాయణ, బొమ్ము శ్రీను, నడింపల్లి శ్రీను, రంగయ్య, పరమేష్, వెంకటయ్య, కృష్ణ పాల్గొన్నారు.
భూభారతి చట్టంతో ఆర్డీఓ, తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కారం
ఫ భూ యజమానికి ఇంటికే వచ్చి సమాచారం నిర్ధారణ
ఫ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, రైతు సేవా ఫౌండేషన్ చైర్మన్ సునిల్‌కుమార్
ఫ రైతు సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చందంపేట మండలంలోని కంబాలపల్లిలో రైతులతో ముఖాముఖి
Comments
Please login to add a commentAdd a comment