విద్యార్థినులు కష్టపడి చదవాలి
విద్యార్థినులు కష్టపడి చదివి భవిష్యత్‌లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం మిర్యాలగూడలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడి వారి విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. బోర్డుపై గణితం లెక్కలు వేసి విద్యార్థినుల నుంచి సమాధానాలు రాబట్టారు. విద్యాబోధన, భోజనం ఎలా ఉందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాఠశాలలోని వంట గదిని పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని ప్రధానోపాధ్యాయురాలు విజయకుమారిని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, ఎంఈఓ బాలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment