ఈ–వేస్ట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం
నల్లగొండ : నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో ఈ– వేస్ట్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మున్సిపల్, రెవెన్యూ అధికారులతో ఆమె సమావేశమై మాట్లాడారు. పనికిరాని ఎలక్ట్రానిక్ సామగ్రిని ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల పర్యావరణం కలుషితమై, ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని తెలిపారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తొలగించేందుకు ఈ– వేస్ట్ మేనేజ్మెంట్ బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ– వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ రీసైక్లింగ్ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, ఈ– వేస్ట్ మేనేజ్మెంట్ ప్రతినిధి విజయకుమార్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్, జూనియర్ సైంటిస్ట్ రాజేష్ పాల్గొన్నారు.
ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి
కట్టంగూర్ : ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కట్టంగూర్ తహసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలో ఉన్న పెండింగ్ భూసమస్యలను వెంటనే పరిష్కరించి.. డిజిటల్ సంతకం చేయని రైతులను గుర్తించి వారిచే సంతకం చేయించాలని సూచించారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఆమె వెంట తహసీల్దార్ గుగులోతు ప్రసాద్, వైద్యాధికారి శ్వేత, డీటీ సుకన్య ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment