పాముకాటు బాధితుల ప్రాణాలు కాపాడాలి
నల్లగొండ: పాముకాటు, కుక్కకాటుకు గురై ఆస్ప త్రులకు వచ్చే బాధితులకు వెంటనే ప్రథమ చికిత్స అందించి వ్యాక్సిన్ వేసి ప్రాణాలు కాపాడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మంగళవారం ఆమె నల్లగొండ కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో వైద్యఆరోగ్య, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కుక్కలు, కోతులను చంపవద్దని, వాటిని పట్టి మున్సిపల్ సిబ్బందికి, అటవీ శాఖ సిబ్బందికి అప్పగించాలన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వెలిమినేడు, అడవిదేవులపల్లి వైద్యాధికారులకు అభినందనలు తెలుపడంతోపాటు కలెక్టర్ వారికి రూ.10 వేలు నగదు బహుమతి ప్రకటించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ మాతృ, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీపీఓ వెంకయ్య, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, ఎంపీడీఓలు, మండల వైద్యాధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా కృషిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం ఆమె కలెక్టరేట్‌లో టీఆర్‌టీఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ భిక్షపతి, టీఆర్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిమ్మనగోటి జనార్దన్, తరాల పరమేశ్ యాదవ్, పూర్వ రాష్ట్ర బాధ్యులు ముప్పిడి మల్లయ్య, జానకిరెడ్డి, టి.సైదులు, జానకిరెడ్డి, జలంధర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బెజవాడ సూర్యనారాయణ, నాయకులు నాళ్ల వెంకటేశ్వర్లు, సంధ్యారాణి, షమీమ్ బేగం, సునీత, వి.రేణుక, మల్లిఖార్జున్, బొమ్ము కృష్ణ, వడ్లకొండ సోమనర్సయ్య, ముడుసు శ్రీనివాస్, లంకపల్లి నగేష్, కె.శేషగిరి, చిట్టబోయిన లింగయ్య పాల్గొన్నారు.
ఫ పల్లెల్లో పారిశుద్ధ్య లోపం ఉండొద్దు
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment