పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
నల్లగొండ: జిల్లాలో దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులతోపాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ కోరారు. బుధవారం నల్లగొండలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగతనాలు నివారణ కోసం రాత్రింబవళ్లు గస్తీ నిర్వహించాలని, పాత నేరస్తుల కదలికలపైనా పటిష్ట నిఘా పెట్టాలని సూచించారు. రాత్రింబవళ్లు అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గస్తీ నిర్వహించాలన్నారు. ఇళ్ల పరిసరాలు, ప్రతి కాలనీ, ముఖ్యమైన కూడళ్లు, రహదారుల వెంట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. బంగారు ఆభరణాలు, నగదు బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలన్నారు. సంక్రాంతి పండుగకు ఇతర ప్రాంతాలకు వెళ్లే పట్టణ. గ్రామీణ ప్రజలు సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులకు ముందుగానే తెలియజేస్తే అక్కడ పోలీస్ వారు నిఘా ఏర్పాటు చేస్తారన్నారు. ఇళ్లలో వృద్ధులు, మహిళలు, పిల్లలు ఒంటిరిగా ఉన్న సమయంలో అపరిచితులు వచ్చి చెప్పే సమాచారం నమ్మవద్దన్నారు. అనుమానితులు సంచరిస్తుంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్లు, 100 నంబర్‌కు డయల్ చేసి సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు.
ఫ దొంగతనాల నివారణకు నిఘా పెంచండి
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్
Comments
Please login to add a commentAdd a comment