సోలార్ ప్లాంట్లకు స్థలాలు గుర్తించాం
నల్లగొండ: జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు జిల్లాలో 270 ఎకరాల స్థలాన్ని గుర్తించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మహిళలందరికీ ఆర్థిక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక మహిళా సభ్యులకు సుమారు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను చేపట్టే విషయంపై బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఆదివారంలోగా తనిఖీ చేసి ఆయా భూముల్లో ప్లాంట్ల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు. అనంతరం అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ గుర్తించిన భూములను సంక్రాంతిలోపు తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌కు జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, రెడ్‌కో జిల్లా మేనేజర్ ఎం.పాండురంగారావు తదితరులు హాజరయ్యారు.
పెండింగ్ అర్జీలను పరిష్కరించాలి
కేతేపల్లి: ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె కేతేపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి ధరణి రికార్డులు, పోర్టల్‌లో పెండింగ్ దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు చర్యలు తీసుకోవాలని, ఇందిరమ్మ ఇళ్ల సర్వే డాటా ఎంట్రీని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇదే సమయంలో కార్యాలయానికి వచ్చిన బండపాలేనికి చెందిన రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఇరువురు రైతులకు సంబంధించిన భూ సమస్యపై మాట్లాడుతూ భూమి మోకా మీద ఉన్న వారికి నిబంధనల ప్రకారం పట్టా చేయాలని ఆదేశించారు. ఆమె వెంట తహసీల్దార్ ఎన్.మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీఓ బి.శ్రీనివాసరావు, ఎంపీఓ నాగమణి ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment