బీజేపీ కార్యాలయంపై దాడి సిగ్గుచేటు
నల్లగొండ టూటౌన్: హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఖండిస్తూ బుధవారం నల్లగొండ పట్టణంలోని పెద్ద గడియారం సెంటర్‌లో బీజేపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి, నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ కార్యాలయంపై దాడి చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాస్తారోకో చేసిన బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, భూపాల్‌రెడ్డి, వెంకటేశం, వంగూరి రాఖీ, మహేష్, కాశమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment